హైదరాబాద్: తెలంగాణ భూములను సీఎం రేవంత్ రెడ్డి స్టాక్ ఎక్స్చేంజీలో కుదవబెట్టి, రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని లక్షా 75 వేల ఎకరాల టీజీఐఐసీ భూములను స్టాక్ ఎక్స్ఛేంజీలో తాకట్టు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని.. ఆ ఆధారాలన్నీ ఈ రోజు బయట పెడుతున్నానని తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ అయిన టీజీఐఐసీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రహస్య జీవో విడుదల చేసిందన్నారు. టీజీఐఐసీ హోదాను మార్చడం ద్వారా రూ.వేల కోట్ల అదనపు రుణాలు సేకరించాలన్నదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఎజెండాగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల సంపద అయిన టీజీఐఐసీ భూములను స్టాక్ ఎక్స్ఛేంజీలో తాకట్టు పెట్టి భారీ ఎత్తున అప్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచిందన్నారు. టీజీఐఐసీ హోదాను మార్చిన విషయం ప్రజలను చెప్పకుండా ఎందుకు దాచి పెట్టారని.. రహస్యంగా, దొంగచాటు జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సంపద అయిన భూములను స్టాక్ ఎక్స్ఛేంజీలో తాకట్టు పెట్టాల్సిన అవసనరం ఏమొచ్చిందని నిలదీశారు. రేపు స్టాక్ ఎక్స్ఛేంజీలో నష్టం జరిగితే తెలంగాణ భూముల భవితవ్యం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యతు గురించి కనీసం ఆలోచన లేకుండా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు ఏమిటని నిలదీశారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#kalvakuntlakavitha #brs #revanthreddy #congress #tgiic #telangana #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️